News
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. సమావేశంలో భాగంగా SLBC టన్నెల్ సహాయక చర్యలను ప్రధాని మోదీకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ట్రిపుల్ ఆర్ ఫ్యూచర్ సిటీకి సాయం చేయాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం.