తెలంగాణ
Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీ

Revanth Redy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం 10గంటల 30నిమిషాలకు ప్రధాని మోదీ భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా పలు ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరనున్నారు సీఎం రేవంత్. మూసీ పునరుజ్జీవం, మెట్రో రైలు విస్తరణపై చర్చించే అవకాశం కూడా ఉంది.
అలాగే రీజనల్ రింగ్ రోడ్డు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక SLBC ప్రమాద ఘటనను మోదీకి వివరించనున్నారు. దాదాపు 6 నెలల తర్వాత మోదీతో సీఎం రేవంత్ భేటీ అవడం ఆసక్తిగా మారింది.