SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. NDRF, SDRF, ఆర్మీతోపాటు నేవీ టీమ్స్, ర్యాట్ హోల్స్ మైనర్స్ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ప్రమాదంలో టన్నెల్ బోరింగ్ మెషీన్ దెబ్బతినడంతో.. వాటి విడిభాగాలు చెల్లాచెదురుగా విరిగిపడ్డ పడ్డాయి. మరోవైపు టన్నెల్‌లో బురద ప్రవాహం పెరుగుతోంది. ఆచూకీ లభించని.. ఆ 8మంది సిబ్బంది ఏ మైనా బురదలో కూరుకుపోయారా అనే అనుమానాలు బయటకు వస్తున్నాయి. దీంతో జియాలజీ సైంటిస్టులు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.
బురద, వరదతో రెస్య్కూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. భారీ మోటార్లతో వాటర్ పంపింగ్ చేస్తున్నామని తెలిపారు. 12 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్‌లో రెస్క్యూ టీమ్ ప్రయాణం చేస్తోంది. అనంతరం కన్వేయర్ బెల్ట్‌పై 1.5కిలోమీటర్లు నడిచి వెలుతోంది. అయితే రెస్క్యూ టీమ్ రాకపోకలతో కన్వేయర్ బెల్ట్ కూడా లూజవు తోంది. ఏ క్షణమైనా బెల్ట్ ఊడిపోయే ప్రమాదం ఉందని సమాచారం.
మరోవైపు SLBC ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం రేవంత్ మరోసారి మాట్లాడారు. అధికారులు-మంత్రులు నుంచి మరోసారి సమాచారం సేకరించారు. ఇక టన్నెల్ పక్క నుంచి తవ్వకాలకు సంబంధించి.. సాధ్యాసాధాలు పరిశీలించాలన్న సీఎం రేవంత్ అధికారులకు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. కాసేపట్లో SLBC వద్దకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకోనున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.