నేడు KRMB ప్రత్యేక సమావేశం

KRMB: నేడు కృష్ణానది యాజమాన్యం బోర్డు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి వాటాలపై అధికారులు చర్చించనున్నారు. అదేవిధంగా సాగర్ కుడి కాల్వ నుంచి నీటి విడుదల, తెలంగాణ ఫిర్యాదుపై ఆఫీసర్స్ చర్చించనున్నారు.
సాగర్‌తోపాటు శ్రీశైలం జలాశయాల్లో నుంచి ఏపీ తన నీటి వాటాను ఇప్పటికే పూర్తిగా వినియోగించుకుందని బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ KRMB ప్రత్యేక సమావేశం అవుతోంది. ఇక నిబంధనలు ఉల్లంఘించి ఏపీ నీటిని తరలిస్తోందని ఫిర్యాదు చేసిన తెలంగాణ నీటి తరలింపును వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తోంది.
నేడు దీనిపై ఏపీ అధికారులు తమ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే అధికారులకు ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేయగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, సాగుకు అవసరం లేకపోయినా నీళ్లు వదిలేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక సముద్రంలోకి వెళ్లే వరద నీటిని దిగువ రాష్ట్రంలో వాడుకుంటే తప్పేంటని ఏపీ వాదిస్తోంది.