తెలంగాణ
జహీరాబాద్‌లో పేలుళ్లు .. భయాందోళనలో స్థానికులు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో డ్రైనేజీలో పేలుళ్లు చోటు చేసుకున్నారు. పట్టణంలోని మూసానగర్ కాలనీలో ఉదయం పూట మురుగు కాలువలో భారీ శబ్దంతో టపాసుల మాదిరి పేలుళ్లు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నీరు ప్రవహించే మురుగు కాలువలో మంటలు, పొగ వీరజిమ్ముతూ ఘటన జరగడం స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఎవరైనా కాలువలో రసాయనాలు పారబోశారా? లేక మరి ఏదైనా కారణమా అనే కోణంలో కాలనీవాసులు చర్చించుకున్నారు. ఘటన స్థలాన్ని పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు సందర్శించి కారణాలు తెలుసుకుంటున్నారు.