తెలంగాణ
Telangana: కేసు పెట్టడానికి వచ్చిన మహిళను చితకబాదిన సీఐ

Telangana: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళపై బోధన్ రూరల్ సీఐ దాడి చేశారు. దీంతో బాధిత మహిళ సీఐ విజయ్బాబుపై ఎడపల్లి పీఎస్లో ఫిర్యాదు చేసింది. తొలుత జాతరలో పర్సు పోయిందని పోలీసులకు చెప్పానంటోంది బాధితురాలు.
మహిళా పోలీసులను సాయం అడుగుతున్న సమయంలో సీఐ వచ్చి నన్ను తీవ్రంగా కొట్టారని బోయి భాగ్య ఆరోపిస్తోంది. అంతేకాదు సీఐ విజయ్ బాబుపై చర్యలు తీసుకోవాలని బోయి భాగ్య డిమాండ్ చేస్తుంది.