తెలంగాణ
అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనలో ఆరుగురు అరెస్ట్

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై.. దాడి ఘటనపై ఇద్దరు మహిళలు సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు పోలీసులు.
2022లో వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యంను స్థాపించడాన్ని.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడని డీసీపీ వెల్లడించారు. రామరాజ్యంలో చేరితే 20వేలు జీతం ఇస్తానని చెప్పాడని డీసీపీ తెలిపారు.