ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు.. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు..

AP Cabinet: ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. అలాగే ఎస్సీ-ఎస్టీ-బీసీ మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదు కునేలా పాలసీలు తీసుకురానుంది.
ఈ మేరకు MSME పాలసీలో మార్పులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. పారిశ్రామిక వేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణ యం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. విద్యుత్ సహా పలు విభాగాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.