సినిమా
Dil Raju: ఐటీ కార్యాలయానికి నిర్మాత దిల్రాజు

Dil Raju: నిర్మాత దిల్రాజు.. ఐటీ కార్యాలయానికి వెళ్లారు. డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్మెంట్లతో ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇటీవల దిల్రాజు నివాసంలో అధికారులు సోదాలు జరిపారు. ఏకంగా నాలుగు రోజులపాటు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
కాగా.. ఇటీవల నిర్మాత దిల్రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలు విడుదలయ్యా యి. ఈ క్రమంలోనే దిల్రాజు నివాసంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. అటు ఐటీ సోదాలు ముగిశాక ప్రెస్మీట్ పెట్టిన దిల్రాజు.. ఐటీ సోదాలు జరగడం మామూలేనన్నారు.