ఆంధ్ర ప్రదేశ్
Eluru: పిల్లి పిల్లలను చూసి.. పులి పిల్లలని భావించి భయాందోళనకు గురైన స్థానికులు

Eluru: ఆగిరిపల్లి మండలం కృష్టవరం గ్రామ సమీపంలో నాలుగు పిల్లి పిల్లలను చూసి పులి పిల్లలని ప్రచారం జరగటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో ఆగిరిపల్లి, గన్నవరం మండలాల్లో పందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కి ఓ పులి మృతి చెందింది.
అయితే చనిపోయిన ఆ పులి పిల్లలు ఇక్కడ తిరుగుతున్నాయని దానిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో స్థానికులు హడలిపోయారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పిల్లలను పరిశీలించారు. అవి పిల్లి పిల్లలు అని తెలవటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.