జాతియం
Kumbh Mela: మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. సెక్టార్ 22లో చెలరేగిన మంటలు
Kumbh Mela: మహా కుంభమేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్ 22లో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున టెంట్లు తగలబడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.