ఆంధ్ర ప్రదేశ్

APSRTC: మహా కుంభమేళాకు APSRTC ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

APSRTC: మహా కుంభమేళాకు APSRTC ఆర్టీసీ ప్రత్యేక బస్సులుయూపీలోని ప్ర‌యాగ‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు ఏపీఎస్ఆర్‌టీసీ ప్ర‌క‌టించింది. విజ‌య‌వాడ నుంచి ఈ ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా ప్రజార‌వాణా అధికారి ఎంవై దానం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఇక ఈ యాత్రలో ప్ర‌యాగ‌రాజ్‌తో పాటు వార‌ణాసి, అయోధ్య పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకునేలా రానుపోను దాదాపు 3,600 కిలోమీట‌ర్లు, మొత్తం 8 రోజుల యాత్ర‌ను ప్లాన్ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 8వ తేదీ వ‌ర‌కు యాత్రను షెడ్యూల్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button