తెలంగాణ
Prashanth Reddy: గ్రామసభల తీరు బోగస్‌లా ఉంది

Prashanth Reddy: గ్రామసభలు జరుగుతున్న తీరు చూస్తే బోగస్ సభలుగా కనిపిస్తున్నాయన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసేలా ఉందన్నారు. ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.
అప్లికేషన్లు, ఇంటింటి సర్వే అంటూ.. ప్రజలను మభ్య పెడుతున్నారంటూ ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టే.. గ్రామసభలు నిర్వహిస్తున్నారి విమర్శించారు.