Kakani: కలెక్టర్ పై కాకాణి సంచలన కామెంట్స్

Kakani: రెడ్ క్రాస్ తాజా పరిస్థితులలో కలెక్టర్ ఆనంద్ వ్యవహారం పై మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి కాకాని పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయంటూ మాజీ మంత్రి కాకాని వ్యాఖ్యానించారు.
రెడ్ క్రాస్ ప్రాథమిక సభ్యత్వలనుండి వైసీపీ సానుభూతిపరులను తొలగించే అధికారం కలెక్టర్కు లేదన్నారు కాకాని.. కలెక్టర్ హోదలో కూర్చునే అర్హత ఆనంద్ కు ఉందో లేదో ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ కలెక్టర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి.. ఇండియన్ రెడ్ క్రాస్ జాతీయ చైర్మన్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అన్న సంగతి తెలుసా లేదా అని ప్రశ్నించారు కాకాని.. రెడ్ క్రాస్ వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తామన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి..