జాతియం
దావోస్‌లో సీఎం రేవంత్ అండ్ టీమ్ కీలక సమావేశాలు
Revanth Reddy: దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్ పర్యటన కొనసాగుతోంది. ఎజిలిటీ కంపెనీ వైస్ ఛైర్మన్ తారెక్ సుల్తాన్‌తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు.. ఆదాయన్ని పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను ఆయనకు వివరించారు. మరోవైపు.. దావోస్‌లో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందాలు చేసుకుంది.
15 వేల కోట్ల విలువైన పెట్టుబడులకు.. మేఘా ఇంజనీరింగ్, ప్రభుత్వం మధ్య 3 ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల వల్ల మేఘా పరిశ్రమలతో 7 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది.