తెలంగాణ
Telangana: గందరగోళం మధ్య కొనసాగుతున్న గ్రామ సభలు.. ఆరు గ్యారంటీలు కోసం నిలదీసిన స్థానికులు

Telangana: తెలంగాణలో కొనసాగుతోన్న గ్రామసభల్లో కొన్ని చోట్ల.. మీటింగ్ బహిష్కరణలు, మరికొన్ని చోట్ల వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. నల్గొండ జిల్లా మోదినగూడెంలో గ్రామసభను స్థానికులు బహిష్కరించారు. గ్రామసభకు వచ్చిన అధికారులను స్థానికులు నిలదీశారు. అభివృద్ధి లేక గ్రామంలో సమస్యలు తిష్టవేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కనీసం సీసీ రోడ్లు కూడా వేయలేదని మండిపడ్డారు.
మరోవైపు.. సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామసభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారులు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాల్లో.. అర్హుల పేర్లు లేవని అధికారులను స్థానికులు నిలదీశారు.