తెలంగాణ
Asifabad: ఆసిఫాబాద్ మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత

Asifabad: ఆసిఫాబాద్ మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఆఫీసును సీఐటీయూ ఆధ్వర్యంలో.. కార్మికులు ఆఫీసును ముట్టడించారు. కార్యాలయం గేటు క్లోజ్ చేసి.. సిబ్బందిని లోపలకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని.. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజేందర్. జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే.. ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్.