తెలంగాణ
రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన రంగనాథ్
కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్ట ఆలయం చుట్టూ ఉన్న భూములు కబ్జా అవుతుంటే ఏంచేస్తున్నారని మండిపడ్డారు. స్థానికంగా ఉన్న నేతలపై కేసులు బుక్ చేయాలని పోలీసులను ఆదేశించారు. కుల సంఘాల పేరుతో కొంతమంది భూములను కబ్జా చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు.