KindIndia NGO : పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు… విద్యార్థుల ఆరోగ్యానికి కైండ్ ఇండియా బాట

KindIndia NGO : KindIndia అనే స్వచ్ఛంద సంస్థ సమాజంలోని వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఆహారం, తాగునీరు, దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలను అందిస్తూ ఈ సంస్థ విశేష సేవలు అందిస్తోంది. ముఖ్యంగా రోగులు, విద్యార్థులు, చిన్నపిల్లలు, వృద్ధులకు సహాయం చేయడంలో ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం.
గత ఏడాది కాలంలో లక్షలాది మందికి సహాయం అందించిన ఈ సంస్థ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి వారం రెండు సార్లు సుమారు 600 పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేస్తోంది. చికిత్స కోసం వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈ సేవ ఎంతో ఉపయుక్తంగా మారింది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ నిర్వహించే దిశగా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇక ప్రభుత్వ పాఠశాలల్లో శుభ్రమైన తాగునీరు అందించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ ఏడాదిలో 100 ఆర్వో యూనిట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. దీని ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు సురక్షితమైన తాగునీరు అందుతూ ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపడుతోంది.
దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సుమారు 10,000 మంది చిన్నపిల్లలు, వృద్ధులకు కొత్త దుస్తులు అందించింది. వివిధ ఎన్జీవోలు, వృద్ధాశ్రమాల ద్వారా ఈ సహాయం అందిస్తూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతోంది. అవసరాలను తీర్చడమే కాకుండా గౌరవప్రదమైన జీవనానికి దోహదం చేయడం ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక Kindwaves India Foundation ఆధ్వర్యంలో మౌలాలి ప్రాంతంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కుండా ప్రతాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రముఖులు పాల్గొని సంస్థ సేవలను ప్రశంసించారు.
“అన్నదానం మిన్న, వేసవిలో జలదానం మిన్న” అనే సందేశంతో ఈ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులకు దోహదం చేస్తున్నాయి. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సంస్థ తెలిపింది.
మరిన్ని వివరాలకు లేదా సహాయం చేయాలనుకునే వారు kindindia.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.



