తెలంగాణ
Kamareddy: వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి

Kamareddy: కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందింది. పాల్వంచ గ్రామానికి చెందిన భవాని ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరింది. వైద్యులు భవానీకి నార్మల్ డెలివరీ చేయాలని భావించారు.
నార్మల్ డెలివరీ కారణంగా శిశువు మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు ఆపరేషన్ చేసి ఉంటే శిశువు బ్రతికి ఉండేదని బాధితులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందన్నారు. నిర్లక్ష్యం వ్యవహరించే వైద్యులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.