తెలంగాణ
మహిళలతో కలిసి స్టెప్పులేసిన మల్లారెడ్డి

హైదరాబాద్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యాక్రమాల్లో పాల్గొంటూ అందరితో కలిసి సందడి చేస్తున్నారు. పండగ సందర్భంగా చిన్నారులకు పతంగులు పంపిణీ చేసి తాను గాలిపటాలు ఎగరువేశారు. అనంతరం కోడి పుంజుల కొట్లాటను వీక్షించారు. మహిళలతో కలిసి స్టెప్పులు వేశారు. అనంతరం సంక్రాంతి పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.



