అఖండ-2 దెబ్బకి వాయిదా పడ్డ చిన్న సినిమాలు!

Akhanda-2: బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ-2’ డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రాకతో పలు చిత్రాల రిలీజ్ తేదీలు మారాయి. ఆ వివరాలు చూద్దాం.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయిన నేపథ్యంలో దాని సీక్వెల్ ‘అఖండ-2’పై అందరి కళ్లూ ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాకతో పలు తెలుగు చిత్రాల రిలీజ్ తేదీలు మార్చబడ్డాయి.
‘మౌగ్లీ’ డిసెంబర్ 13కి, ‘ఈషా’ డిసెంబర్ 25కి షిఫ్ట్ అయ్యాయి. అలాగే ‘సైక్ సిద్ధార్థ’ జనవరి 1వ తేదీకి వాయిదా పడింది. కానీ తమిళ డబ్బింగ్ చిత్రం ‘అన్నగారు వస్తారు’ మాత్రం డిసెంబర్ 12నే రిలీజ్ అవుతోంది. దీంతో ‘అఖండ-2’ భారీ ఒపెనింగ్స్ సాధించే అవకాశం ఉండటంతో మిగతా చిత్రాల టీమ్‌లు ఇలా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది.



