తెలంగాణ
65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

దేవాదాయ శాఖ ఆదాయం మహా లక్ష్మీ పథకం ద్వారా పెరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన 65 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాణిగంజ్ నుండి 65 ఎలక్ట్రీక్ బస్సులను ప్రారంభించామని ఇప్పటికే హైదరాబాద్ , కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఈ బస్సులు నడుస్తున్నాయన్నారు.
ఆర్టీసీకి శ్రమిస్తున్న ఉద్యోగులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు మంత్రి. మహా లక్ష్మి పథకం ప్రారంభించిన 2 ఏళ్లలోనే 40 శాతం బస్సులను కొనుగోలు చేశామన్నారు. కాలుష్యం తగ్గించేందు ఈ ఎలక్ట్రీక్ బస్సులను నడుపుతున్నామని మంత్రి తెలిపారు.



