సినిమా
Betting App Case: నేడు విచారణకు హాజరుకానున్న నటుడు ప్రకాష్ రాజ్

Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై ప్రత్యేకంగా ఏర్పాటైన సీఐడీ సిట్ ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా పలువురు సినీ నటులకు నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. నేడు నటుడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరుకానున్నారు. నిన్న విజయ్ దేవరకొండను సీఐడీ విచారించింది.
బెట్టింగ్ యాప్‌ల తరఫున మీరెందుకు ప్రచారం చేశారు? ఈ యాడ్స్ ప్రమోట్ చేయాలని మిమ్మల్ని ఎవరు సంప్రదించారు? యాడ్స్‌లో నటించినందుకు ఎంత డబ్బు తీసుకున్నారు?’అని విజయ్ దేవరకొండను అధికారులు ప్రశ్నించారు. విజయ్‌ని అధికారులు గంటకుపైగా ప్రశ్నించారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో పాల్గొనడానికి దారితీసిన కారణాలు, అందుకు సంబంధించి నగదు లావాదేవీలపై ప్రశ్నించారు.



