తెలంగాణ
Pace Hospitals: మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం.. ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

Madhapur: మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఎల్లమ్మ పేస్ హాస్పిటల్‌లో చేరింది. ఆసుపత్రిలో చేరినప్పుడు రెండు లక్షల 20 వేలు కట్టించుకున్నారు. ఇక ఎల్లమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు ఆసుపత్రి యాజమాన్యం.
తర్వాత ఎల్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని ఇంకా మూడు లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారు డిమాండ్ చేసిన మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేసేందుకు వెళ్లగా ఎల్లమ్మ చనిపోయిందన్నారు. మూడు లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి ఎదుట మృతురాలు ఎల్లమ్మ బంధువులు ధర్నాకు దిగారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.