ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి

Pawan Kalyan: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు బైక్ను ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు.



