తెలంగాణ
కేసీఆర్, కేటీఆర్‌పై ఈడీకి ఫిర్యాదు..

మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై బీసీ పోలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్‌గౌడ్ ఈడీకి ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓఆర్ఆర్ టోల్ లీజ్‌లో అవకతవకలు జరిగాయని యుగంధర్‌గౌడ్ ఫిర్యాదు చేశారు. ORRని IRB సంస్థకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 30ఏళ్లకి లీజుకు ఇచ్చారని తెలిపారు.
IRB సంస్థ నుండి రూ.25 కోట్ల ఎలక్టొరల్ బాండ్ కొనుగోలు చేశారని యుగంధర్‌గౌడ్ ఆరోపించారు. BRS పాలనలో క్విడ్ ప్రోకోతో ఎన్ క్వాష్‌మెంట్ జరిగిందన్నారు. కోట్ల రూపాయల గోల్ మాల్ లో BRS కీలకనేత కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు.