తెలంగాణ
New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

New Year Celebrations: న్యూ ఇయార్ కి డ్రగ్స్ సరఫరా చేసే ముఠాను అరెస్టు చేసిన ఫిలింనగర్ పోలీసులు. వేడుకలను ఆసరాగా చేసుకుని ముంబై నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చిన ముఠా. ముగ్గురు ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు. అబ్దుల్ ఇర్ఫాన్, రహమత్ అలీ, హజ్మతుల్లా ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించిన పోలీసులు.. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ పై ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేశాం.. పబ్స్, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్ లలో డ్రగ్స్ సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. ఇప్పటికే కొన్ని ముఠాలపై నిఘా పెట్టాం.. వారి కదలికలపై ఎప్పటికప్పుడు పోలీసులు అనుసరిస్తూనే ఉంటారు.. శివారు ప్రాంతాలలో చాలామంది సెలబ్రేషన్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తమ దృష్టికి వస్తున్నాయి.. అలా అనుమతి లేనిది పార్టీ నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు .