తెలంగాణ

Anganwadi: అంగన్వాడీలకు వెళ్లే సామగ్రి పక్కదారి..

Anganwadi: అక్రమార్కులు ఆఖరికి చిన్నారులకు అందాల్సిన సామగ్రిలోనూ దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ తంతు నడుస్తుందని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 1975 సంవత్సరంలో అంగన్వాడీ వ్యవస్థను తీసుకువచ్చింది. ఈ సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పిల్లల కోసం మంచి భోజనం అమలుపరుస్తుంది. మధ్యహ్న భోజనం, గర్భిణీలకు కోడిగుడ్లు, బాలింతలకు పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరే… మరి ఆయాలు సూపర్వైజర్లు ఏంచేస్తున్నారనేది ప్రాథమిక ప్రశ్న. ప్రభుత్వాలు ఎన్ని పటిష్ట చర్యలు తీసుకున్నా అక్రమార్కులు మాత్రం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. కనీసం ఈ సూపర్‌వైజర్లైనా చిన్నారుల పట్ల శ్రద్ధ చూపాలని బాలల హక్కుల నాయకులు అంటున్నారు. అంతేకాకుండా గర్భిణీల కోసం పౌష్టికాహారం పిల్లల కోసం బాలామృతం అందిస్తుంది. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అంగన్వాడీకి చేరాల్సిన సామగ్రిలో చేతివాటం చూపిస్తున్నారని మండిపడుతున్నారు.

ఇక అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రత మాత్రం అగమ్యగోచరం అంటున్నారు స్థానికులు. నాణ్యత లేని కూరగాయలు, కుళ్లపోయిన గుడ్లను చిన్నారులకు అందిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఎన్నోసార్లు కుళ్లిన గుడ్లను చిన్నారులకు ఇవ్వడం చూశామని స్థానికులు ఫిర్యాదు చేయగా ఈ తతంగం అంతా వెలుగులోకి వచ్చింది.

అంగన్వాడికి సంబంధించిన సామాగ్రి పక్కదారి పట్టించిన వారి పైన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా కాంట్రాక్టర్ల పైన అధికారులు ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సీడీపీఓల మీద సూపర్‌వైజర్ల మీద అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఒకటి రెండు చోట్ల మాత్రమే శుభ్రంగా ఉన్నాయని మిగతా సెంటర్లలో శుభ్రత పాటించడం లేదని బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు అంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button