తెలంగాణ
హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం పర్యటన

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని లబ్ధిదారులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారుల నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు.
అనంతరం హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. నూతనంగా ఏర్పాటుచేసిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రిని తీసుకొచ్చి భవనాలకు శంకుస్థాపన చేస్తామన్నారు.



