తెలంగాణ
Ponnam Prabhakar: దేశ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు చేశారు

Ponnam Prabhakar: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ధ్రిగ్బాంతి వ్యక్తం చేశారు. 15 వ లోక్సభలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా తాను లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పాల్గొన్న సమావేశాలను గుర్తు చేసుకున్నారు.
మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 2004 – 14 మధ్య దేశ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు చేశారని ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం గుర్తుచేసుకున్నారు.