తెలంగాణ
Raj Gopal Reddy: దిగజారి బతకడం నాకు తెలియదు

Raj Gopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది ..కానీ మునుగోడు ప్రజల కోసం వదులుకున్నానని అన్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు. మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఆఫర్ చేశారని ఆయన తెలిపారు.
భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామమని అన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గుర్తు చేశారు. మంత్రి పదవి ఇవ్వడం, ఇవ్వకపోవడం వాళ్ల ఇష్టమన్నారు. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవట్లేదన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారని ఆయన విమర్శించారు. నాకన్న చిన్నవారికి కూడా పదవులు ఇచ్చారని ఆయన మండిపడ్డారు.



