BJP: రాజ్యసభ స్థానాలపై బీజేపీ ఫోకస్

BJP: లోక్‌సభలో అధికారపార్టీకి 400 స్థానాలు దాటినా పాలన సజావుగా సాగడం, అనుకున్న బిల్లులు ఆమోదింపచేసుకోవడం, చట్టాలు చేయడం వంటివి అంత తేలిగ్గా జరగవు. లోక్‌సభలో పాటు రాజ్యసభలోనూ బలముంటేనే అధికార పార్టీ అనుకున్నది చేయగలుగుతుంది. పెద్దల సభలో మెజార్టీ లేకపోతే బిల్లుల ఆమోదంలో అనేక పార్టీల మద్దతు పొందాల్సి ఉంటుంది.
11ఏళ్లుగా కేంద్రంలో అధికారంలోకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. అనేక బిల్లుల మద్దతుకు ప్రాంతీయపార్టీల సహకారం తీసుకుంది. నెమ్మదిగా ఆ పరిస్థితి నుంచి బయటపడి, రాజ్యసభలో బలం పెంచుకోవడంపై దృష్టిపెట్టిన బీజేపీ అనుకున్నలక్ష్యం దిశగా సాగుతోంది.
దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ఎగువ సభలో కూడా సంఖ్యను పెంచుకుంటుంది. వరుసగా 11ఏళ్లు అధికారంలో కాషాయ పార్టీ రాజ్యసభలో సొంతంగా బలాన్ని పెంచుకోవడంలో కొంత వెనకబడింది. తిరిగి రాజ్యసభలో పట్టుసాధించేందుకు కమల దళం దృష్టి పెట్టింది. దేశంలో ఓ వైపు కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోతోన్న క్రమంలో బీజేపీ తన బలాన్ని పుంజుకుంటోంది. బీజేపీ చరిత్రలో రెండో సారి రాజ్యసభలో తన బలాన్ని వంద సీట్లకు పెంచుకుంది.
బీజేపీకే కాదు దేశ రాజకీయాల్లోనే ఇది కీలకపరిణామం. ఎందుకుంటే మూడు దశాబ్దాల తర్వాత ఓ పార్టీకి పెద్దల సభలో ఇంత పెద్దమొత్తంలో బలం ఉండడం ఇదే తొలిసారి. 1990లో అప్పటి అధికార కాంగ్రెస్‌కు ఎగువసభలో 108 మంది సభ్యులుండేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎప్పుడూ ఆ స్థాయిలో బలం పెంచుకోలేదు.
మొత్తం 245 సభ్యులు కలిగిన రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ తక్కువగానే ఉన్నప్పటికీ 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2014లో బీజేపీ బలం 55గా ఉండగా ఆయా రాష్ట్రాల్లో వరుస విజయాలతో రాజ్యసభలోనూ తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. తాజా రాష్ట్రపతి నామినేటేడ్ రాజ్యసభ ఎంపీ ఎన్నికతో బీజేపీ సెంచరీ కొట్టింది.
మూడు దశాబ్దాల తర్వాత రాజ్యసభలో 100 సీట్లపైగా మార్కును దాటిన పార్టీగా రికార్డు నెలకొల్పింది. 1990లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలం నాడు 99 ఉండగా 35 ఏళ్ల తర్వాత బీజేపీ సెంచరీ దాటింది. అలా అప్పటి నుంచి మొదలైన కాంగ్రెస్ పతనం సంకీర్ణ ప్రభుత్వం నాటికి మరింత దిగజారింది.
2022 తర్వాత తొలిసారిగా భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో 102 మంది సభ్యులను చేరుకుంది. ముగ్గురు నామినేటెడ్ ఎంపీలు ఉజ్వల్ నికమ్, హర్ష్ వర్ధన్ శ్రింగ్లా , సి సదానందన్ మాస్టర్ పార్టీలో చేరడంతో బీజేపీ 100 మార్క్‌ను దాటింది. ఈ ముగ్గురూ గత నెలలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురు నామినేటెడ్ ఎంపీల చేరికతో, బిజెపి సంఖ్య ఇప్పుడు 102 కు చేరుకుంది. ఎన్డీఏ రాజ్యసభలో 134 మంది సభ్యులను కలిగి ఉంది. వీరిలో 5 మంది నామినేటెడ్ ఎంపీలు ఉన్నారు. సభలో 123 మెజారిటీ మార్కును బీజేపీ దాటింది.
ఉజ్వల్ నికమ్ 26/11 ముంబై దాడులకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.దాడుల్లో పాల్గొన్న ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను విచారించిన తర్వాత నికమ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. దాడుల్లో పాల్గొన్న ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను సజీవంగా పట్టుకున్నారు. ఆయనకు 2016లో పద్మశ్రీ లభించింది. గత సంవత్సరం ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుండి బిజెపి టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ కాంగ్రెస్‌కు చెందిన వర్ష గైక్వాడ్ చేతిలో ఓడిపోయారు.
హర్ష్ వర్ధన్ ష్రింగ్లా 2020 – 2022 మధ్య విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు . 2023లో జి20 శిఖరాగ్ర సమావేశానికి చీఫ్ కోఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు. ఆయన అమెరికాలో భారత రాయబారిగా, బంగ్లాదేశ్‌లో హైకమిషనర్‌గా విధులు నిర్వర్థించారు. సి సదానందన్ మాస్టర్ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త. 1994లో కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారు ఆయన కాళ్లు నరికివేయబడ్డాయి. మిస్టర్ మాస్టర్ 2016లో కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి టికెట్‌పై పోటీ చేశారు, కానీ గెలవలేకపోయారు.
అధికార భారతీయ జనతా పార్టీ బీజేపీకి రాజ్యసభలో గణనీయమైన బలం చేకూరింది. లోక్‌సభలో మిత్రపక్షాల సహకారంలో మెజార్టీ సాధించిన బీజేపీ..రాజ్యసభలోను పట్టుసాధించాలని భావిస్తుంది. రాజ్యసభలో అత్యధిక స్థానాలు గెలుచుకొని బిల్లులను పాస్ చేయించేలా కమలం పార్టీ వ్యూహ రచన చేస్తుంది. ఇప్పటికై ఉపరాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదలైంది. రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సత్తా చాటాలని కాషాయ పార్టీ భావిస్తుంది.