ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధం

AP: ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. మొదటగా రాష్ట్ర సచివాలయం నుంచే దీనికి తొలి అడుగుపడాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి సచివాలయంలో ప్లాస్టిక్‌పై నిషేధం అమలు కాబోతోంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులను సెక్రటేరియట్లోనికి అనుమతివ్వరు.
బయట నుంచి వచ్చే వాహనాలను పూర్తిస్థాయిలో స్క్రీన్ చేసి వాటర్ బాటిల్ ఉంటే సెక్యూరిటీ సిబ్బంది వాటిని తీసేసుకుంటారు. వాటి స్థానంలో సచివాలయంలో ప్రతి ఉద్యోగికి ఒక రీ యూజబుల్ స్టీల్ వాటర్ బాటిల్‌ని ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే క్యాంటీన్‌తో పాటు అన్ని ప్రాంతాల్లో స్టీల్ బాటిళ్లను ఉంచబోతున్నారు.