ఊర్వశి రౌతేలా బంగారం దొంగతనం!

Urvashi Rautela: బాలీవుడ్, టాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు లండన్‌లో షాకింగ్ అనుభవం ఎదురైంది. గాట్విక్ విమానాశ్రయంలో రూ. 70 లక్షల విలువైన జువెలరీతో కూడిన లగ్జరీ సూట్‌కేస్ దొంగిలించబడింది. విమానాశ్రయ అధికారుల నిర్లక్ష్యంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలలోకి వెళితే…
ప్రముఖ నటి ఊర్వశి రౌతేలా లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో దొంగతన ఘటనతో విస్తుపోయారు. వింబుల్డన్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె రూ. 70 లక్షల విలువైన జువెలరీతో కూడిన లగ్జరీ సూట్‌కేస్‌ను కోల్పోయారు. లగేజ్ బెల్ట్‌లో బ్యాగ్ కనిపించకపోవడంతో గంటల తరబడి ఎదురుచూసినా ఫలితం లేకపోయింది.
అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, స్పందన లేకపోవడంతో ఆమె నిరాశకు గురయ్యారు. ఎమిరేట్స్ ప్లాటినం సభ్యురాలిగా, గ్లోబల్ ఆర్టిస్ట్‌గా తనకు ఎదురైన ఈ ఘటన భద్రతా వైఫల్యాన్ని సూచిస్తోందని ఆమె ఆరోపించారు.
ఇది కేవలం తన సమస్య కాదని, ఇతర ప్రయాణికులకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవ్వొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల, ఊర్వశి తల్లి కూడా మేనేజర్ వేదికా ప్రకాష్ శెట్టిపై దొంగతనం ఆరోపణలు చేశారు. 2015 నుంచి వారితో పనిచేసిన వేదికా, ఖరీదైన వస్తువులను మాయం చేసిందని ఆరోపించారు.