సమంత రింగ్ రహస్యం! డేటింగ్ పుకార్లకు ఆజ్యం!

Samantha: సమంత మళ్లీ వార్తల్లో నిలిచింది! సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలో ఆమె చేతివేలికి స్పెషల్ రింగ్ కనిపించింది. ఈ రింగ్ వెనుక రహస్యం ఏమిటి? రాజ్ నిడమోరుతో రిలేషన్ రూమర్స్‌కు ఇది ఆజ్యం పోస్తుందా? దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సమంత రూత్ ప్రభు మరోసారి సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె చేతివేలికి డైమండ్ రింగ్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఓవల్ షేప్ స్టోన్‌తో, డైమండ్స్‌తో మెరిసే ఈ రింగ్ యానిక్ డిజైన్‌తో ఉంది. గతంలో ఇలాంటి రింగ్ సామ్ ధరించలేదు, దీంతో ఊహాగానాలు మొదలయ్యాయి.
రాజ్ నిడమోరుతో ఆమె రిలేషన్ గురించి వస్తున్న వార్తలు మరింత బలపడ్డాయి. అమెరికా వెకేషన్, ఒకే కారులో కనిపించడం వంటివి ఈ రూమర్స్‌కు ఊతమిచ్చాయి. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటడెల్: హనీ బన్నీలో రాజ్‌తో కలిసి పనిచేసిన సమంత ప్రాజెక్ట్‌లు, శుభం సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా రాజ్ ఉన్నాడు. అయితే, ఈ రిలేషన్ రూమర్స్‌పై సమంత, రాజ్ స్పందించలేదు. మరి ఈ సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి.