తెలంగాణ
సృష్టి కేసులో కస్టడీలోకి తీసుకున్న డాక్టర్ నమ్రత

సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అంతకు ముందు ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. గోపాలపురం పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నారు.
కోర్టు ఆమెకు 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది . తాను ఎలాంటి తప్పు చేయలేదని డాక్టర్ నమ్రత అన్నారు. అజయ్ కల్లం ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు.