తెలంగాణ
Addanki Dayakar: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు

Addanki Dayakar: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, వైసీపీ, సీపీఐ సభ్యులను బీఆర్ఎస్ చేర్చుకుందన్నారు. నాలుగు పార్టీలను విధ్వంసం చేసిన బీఆర్ఎస్ ఇవాళ చిలక పలుకులు పలుకుతోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో మిగతా పార్టీలు ఉండొద్దని గతంలో కక్కుర్తి పడ్డ కేసీఆర్ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు సానుకూలంగా ఉంటే గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ దళిత వ్యక్తి సీఎల్పీ లీడర్ అయితే సహించలేకపోయారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు.