తెలంగాణ
Adi Srinivas: సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Adi Srinivas: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ తీరు చూస్తే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్ధ యాత్రలకు వెళ్లినట్లు ఉందని ఆయన విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 60 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన మండిపడ్డారు. శాసనసభలో పార్టీలకు పార్టీలను విలీనం చేసుకున్నామని గొప్పలు చెప్పుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.
సుప్రీం తీర్పుపై స్పీకర్ ప్రసాద్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. స్పీకర్‌కు విశేష అధికారులు ఉంటాయని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టుకు కూడా స్పీకర్ నిర్ణయం ప్రకారం జరగాలని చెప్పిందని అన్నారు.