Vemireddy: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం

Vemireddy: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి మైనింగ్ పై వైసీపీ నేతలు కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వేమిరెడ్డి క్వార్ట్జ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా సిద్ధమవుతున్నారు. దీనిపైనా వైసీపీ నేతలు ఆయన్ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేయాలని నిర్ణయం తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో 96 కంపెనీలు క్వార్ట్జ్ ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నాయని, కానీ వైసీపీ నేతలు తన కంపెనీల్ని మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని వేమిరెడ్డి తెలిపారు. క్వార్ట్జ్ ఫ్యాక్టరీ ద్వారా వెయ్యి మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటే తనపైనే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని వేమిరెడ్డి ప్రశ్నించారు.
ఈ క్వార్ట్జ్ ఫ్యాక్టరీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, తాను వదిలేశాను కాబట్టి ఇంకెవరైనా ఈ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చని కూడా ఆయన సూచించారు. అందుకు కూడా తాను సహకరిస్తానన్నారు. దోచేసుకుంటున్నానంటూ తనపై చేస్తున్న విమర్శలు తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేపటి నుంచి దీనిపై మాట్లాడితే వారి కర్మకే వదిలిపెడుతున్నట్లు వేమిరెడ్డి తెలిపారు.