ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. అధికారులు 8గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 2 లక్షల 93వేల 609 ఉండగా ఔట్‌ఫ్లో 2లక్షల 82 వేల 502 క్కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 882 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 203 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.