మెహదీపట్నం ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత.. తోపులాటలో ప్రభుత్వ అధికారి మృతి

హైదరాబాద్ అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మెహదీపట్నం ఆర్ టిసి డిపో ఎదురుగా ఉన్న మెహిదీపట్నం ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత చోటుసుకుంది. తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్‌కు చెందిన అధికారులు, మెహదీపట్నం ఫంక్షన్ హాల్ యాజమాన్యం మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఆర్ జగదీశ్వర్ రావు అనే అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ స్పృహ తప్పి కిందపడిపోయాడు. వెంటనే తోటి ఉద్యోగులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఆర్ జగదీశ్వరరావు మృతి చెందాడు. మెహదీపట్నం ఫంక్షన్ హాల్ యాజమాన్యం గత ఎనిమిది సంవత్సరాలుగా హౌసింగ్ బోర్డుకు డబ్బులు చెల్లించకపోవడంతో కోటి యాభై లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. కోర్టు ఆర్డర్ తో ఫంక్షన్ హాల్ ను సీజ్ చేసేందుకు హౌసింగ్ బోర్డు అధికారులు మెహిదీపట్నం వచ్చారు. సీజ్ చేసే క్రమంలోనే అధికారులు, ఫంక్షన్ హాల్ యజమాన్యం మధ్య తోపులాట జరగడంతో అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ జగదీశ్వర్ రావు కిందపడి చనిపోయాడు. సరైన పోలీసు ఫోర్స్ లేదని హౌసింగ్ కార్పొరేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.