తెలంగాణ
MLC Kavitha: లీడర్” రాజకీయ నాయకత్వ శిక్షణ కార్యక్రమం

MLC Kavitha: తెలంగాణ జాగృతి సంస్థను కొత్త సంస్థగా మార్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ శిక్షణా తరగతులను నిర్వహించారు.
ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటారు. సమాజంలో మార్పు తేవడంలో రాజకీయాలు ఓ మార్గం అని అన్నారు. పోరాటతత్వం, సమయస్ఫూర్తి అన్ని కలగలిసిన నాయకుడిగా తెలంగాణ జాగృతి నాయకులను సిద్ధం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.