తెలంగాణ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలోకి చేరిన వర్షం నీరు

Rain Water: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోకి వర్షం నీరు చేరింది. కురిసిన వర్షానికి కార్యాలయంలో కి నీళ్లు రావడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవల స్లాబ్ నుండి లీకేజీ అవుతూ నీళ్లు కారడంతో మరమ్మతులు చేయించారు. జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. డ్యాకుమెంట్లు, తడుస్తాయని అధికారులు హైరానా పడుతున్నారు.
నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో జలమయం అయితే టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. అదే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలోకి నీళ్లు వస్తే ఎవరికి ఫోన్ చేస్తారని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. నీళ్ల లీకేజ్‌పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.