క్రికెట్ అసోసియేషన్ అక్రమాల పుట్ట.. సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి మరో భారీ స్కాం

HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల పుట్ట కదులుతోంది సీఐడీ దర్యాప్తులో మరో భారీ స్కాం వెలుగుచూసింది. సమ్మర్ క్యాంప్‌ల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు హెచ్‌సీఏ కేటుగాళ్లు. తప్పుడు లెక్కలు చూపించి కేవలం ఒక్క నెల రోజుల్లోనే ఏకంగా 4 కోట్ల రూపాయలు కాజేశారు జగన్మోహన్‌రావు అండ్ కో. ఆటగాళ్లు శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఓ బ్యాటు ఓ బాల్ మాత్రమే ఇచ్చి కిట్ మొత్తం ఇచ్చినట్టు సృష్టించారు. సీఐడీ దర్యాప్తు లో HCA డొంక కదిలి రోజుకో అవినీతి బయటపడుతోంది.
ఒక్కో క్యాంప్‌పై 15 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి రూ.4 కోట్ల రూపాయలు జగన్‌మోహన్‌రావు కాజేశారు. క్యాంప్‌కి హాజరైన విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంప్‌లు నిర్వహించిన కేంద్రాల్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో క్యాంప్‌లో లక్ష కూడా ఖర్చు చేయలేదని సీఐడీ ఆధారాలు సేకరించింది.