తెలంగాణ
హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో గంజాయి పట్టివేత

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో గంజాయి పట్టుబడింది. వైజాగ్ నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు డీసీపీ చైతన్య ఆదేశాలతో బండ్లగూడ చౌరస్తా వద్ద కారును పోలీసులు అడ్డుకున్నారు. కారులో ప్యాకింగ్ చేసిన 25కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.