తెలంగాణ
వికారాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం

వికారాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. తాండూర్లో వర్షం దంచికొట్టింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారింది. తాండూరు – హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. వరద నీటితో పలు కాలనీలు జలదిగ్భంధం చిక్కుకున్నాయి.
చిలుకవాగు కబ్జాకు గురికావడంతో కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. మిత్ర నగర్, గ్రీన్ సిటీ, మార్కండేయ కాలనీలలో వరద నీరు చేరడంతో స్థానికులు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. కాలనీలు నీటమునిగిన అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు.