తెలంగాణ
కాంగ్రెస్ కార్యకర్త హమీద్ పై హత్యాయత్నం

హైదరాబాద్ నాంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. దాడిలో హమీద్‌కు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఎంఐఎం కార్యకర్త ఖుబ్లా హత్యకు గురయ్యాడు.
గతంలో ఖుబ్లాను చంపేస్తానని హమీద్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హమీద్‌పై ఖుబ్లా బంధువులు దాడి చేశారు. ఆఫీస్ ఫర్నిచర్‌తో పాటు ద్విచక్ర వాహనాన్ని కూడా దుండగులు ధ్వంసం చేసినట్లు బాధితుడు హమీద్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.