తెలంగాణ
కేటీఆర్‌పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్

కేటీఆర్‌పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైరయ్యారు. కేటీఆర్ విచక్షణ కోల్పోయి సీఎం పైన మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. డ్రగ్స్ టెస్టులకు రమ్మని సవాల్ చేస్తే కేటీఆర్ కోర్టు తీర్పును వక్రీకరించి మాట్లాడతున్నారని ఆయన మండిపడ్డారు.
డ్రగ్స్ టెస్ట్‌కి శాంపిల్స్‌లో నెగిటివ్ వచ్చే డిటాక్టివ్ టెస్టులు యూకేలో చేయించుకున్నాడని ఆయన ఆరోపించారు. నెగిటివ్ వచ్చాక ఇప్పుడు డ్రగ్స్ టెస్ట్‌కి రెడీ అంటున్నాడని అన్నారు. ఫోన్ ట్యపింగ్‌కు పాల్పడలేదని లై డిటెక్టర్ టెస్ట్ కేసీఆర్, కేటీఆర్ చేసుకొని మాకు సవాల్ చేయాలని అన్నారు.