Sreeleela: తన పెళ్ళి, డేటింగ్ విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీలీల?

Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీలీల తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పెళ్లి, డేటింగ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ పెళ్లి,డేటింగ్ గురించి ఆమె ఏమని చెప్పిందంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి చేసుకోనని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్లో లేనని, తన ఫోకస్ పూర్తిగా కెరీర్‌పైనే ఉందని చెప్పారు. అమెరికా టూర్లో సైతం తన తల్లి తనతోనే ఉంటారని, ఎప్పుడూ తనకు సన్నిహితంగా ఉంటూ మార్గదర్శనం చేస్తారని శ్రీలీల వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. శ్రీలీల ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటన, అందం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తన కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.